JAGITYAL | జగిత్యాల, ఏప్రిల్ 7: వేసవికాలంలో జగిత్యాల జిల్లా ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా విద్యుత్ శాఖ కృషి చేస్తుందని జగిత్యాల విద్యుత్ శాఖ ఎస్ఈ సాలియా నాయక్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని టౌన్2 సెక్షన్ పరిధిలోని విద్యానగర్ రామాలయం ఎదురుగా డిటి ఆర్ 21 కు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ 100 కెవిఏ నుండి 160 కెవిఏ లోడ్ గా అప్ గ్రేడ్ చేసిన నేపథ్యంలో దానిని ఎస్ఈ సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండాకాలం అధిక లోడ్ వాడుతున్న నేపథ్యంలో లోడును అధిగ మించేందుకు సమ్మర్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా జిల్లావ్యాప్తంగా కూడా ట్రాన్స్ఫార్మర్లను అప్ గ్రేడ్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక డిఈలు రాజిరెడ్డి, గంగారాం, రవీందర్, ఏడీఈ జవహర్ లాల్, ఏఈ సంతోష్ కుమార్, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.