MLA Medipalli Satyam | గంగాధర, సెప్టెంబర్ 17: గంగాధర మండలం గర్షకుర్తిలో విజిలెన్స్ అండ్ ఇన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేసిన పవర్ లూమ్స్ ను బుధవారం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పరిశీలించారు. అధికారులు కేసులు నమోదు చేసిన కార్మికులతో మాట్లాడి ఆందోళన చెందవద్దని భరోసా కల్పించారు. చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ తో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులను గర్షకుర్తికి అనుమతించవద్దని కోరారు. విజిలెన్స్ అధికారులు కార్మికులపై నమోదు చేసిన కేసులను రద్దు చేయించి, సీజ్ చేసిన పవర్ లూమ్స్ ను తిరిగి తెరిపిస్తామని కార్మికులకు హామీ ఇచ్చారు.
చేనేత కార్మికులను ఇబ్బంది పెట్టేలా అధికారులు ప్రవర్తిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎమ్మెల్యే వెంట సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిర్మలరావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోట కరుణాకర్, సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, తహసీల్దార్ అంబటి రజిత, ఎంపీడీవో దమ్మని రాము, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దుబ్బాసి బుచ్చయ్య, నాయకులు రామిడి రాజిరెడ్డి,రోమాల రమేష్, జాగిరపు శ్రీనివాస్ రెడ్డి, పడాల రాజన్న, దోర్నాల శ్రీనివాస్ రెడ్డి, చిప్ప చక్రపాణి, తిరుపతి, శ్రీనివాస్, వేముల అంజి, రాజేశం ,మల్లికార్జున్, గరిగంటి కరుణాకర్, మల్లేశం,ముచ్చ శంకర్, చందు, మధు, శ్రీధర్, ముద్దం నగేష్, అంజి, ప్రవీణ్, తదితరులు ఉన్నారు.