Choppadandi | గంగాధర, మే 31: రాజకీయాలకతీతంగా చొప్పదండి నియోజకవర్గం అభివృద్ధికి సహకారాన్ని అందజేస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర మండలం మధురానగర్ లో గ్రామీణ ఉపాధి హామీ నిధులతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్డు, డ్రైనేజీని ఎంపీ బండి సంజయ్ కుమార్, ఎమ్మెల్యే మేడిపల్లి శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంగాధర మండలంలోని వివిధ గ్రామాల్లో ఉపాధి హామీ నిధులు రూ. 2.63 సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాన్ని చేసినట్లు తెలిపారు. రాజకీయాలకతీతంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేస్తామని, ఎన్నికల తరువాత కలిసి అభివృద్ధి చేస్తామని తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో చొప్పదండి నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బోడిగే శోభా, బిజెపి నియోజకవర్గ కన్వీనర్ పెరుక శ్రవణ్, పురుమల్ల మనోహర, పంజాల ప్రశాంత్, వేముల భాస్కర్, వేముల అంజి, దాతు అంజి, రెండ్ల శ్రీనివాస్, శ్రీపతి రాజేంద్ర ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.