Awareness of Law | పెద్దపల్లి రూరల్ అక్టోబర్ 18 : విద్యార్థులుగా ప్రతి ఒక్కరు న్యాయపరమైన చట్టాలపై అవగాహన పెంచుకుంటూనే ఒక నిర్థిష్టమైన లక్ష్యంతో ముందుకు సాగితే మంచి భవిష్యత్ ఉంటుందని పెద్దపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. పెద్దపల్లి మండలంలోని పెద్దబొంకూర్ లో గల మదర్ థెరిస్సా ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా లీగల్ ఎయిడ్ సెల్ మెంబర్ నుచ్చ శ్రీనివాస్ యాదవ్ తో పాటు సభ్యులు, న్యాయవాదులు పలు రకాల చట్టాలపై అవగాహన కల్పించారు. అనంతరం జిల్లా జడ్జీ సునీత కుంచాల మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి నిత్యం ప్రేమ వివాహాల , వ్యవహారాలు పెరిగిపోతున్నాయని వాటి విషయంలో చట్టానికి అనుగుణంగా అవగాహన పెంచుకుని మెదిలితే ఎలాంటి సమస్యలు రావని, బాల్య వివాహాలు, ప్రేమ వివాహాలపై కఠినమైన చట్టాలు ఉన్నాయని వాటి గురించి తెలుసుకుని మెదిలితే ఆయా కుటుంబాలకు ఎలాంటి సమస్యలు రావన్నారు.
చదువుకునే విద్యార్థులుగా ఒక ప్రత్యేకమైన ఉన్నత లక్ష్యం దిశగా పయనిస్తే జీవితంలో ఉన్నతస్థానం పొందటం పెద్ద సమస్య కాదన్నారు. చదువుకునే సమయం నుంచే తల్లిదండ్రుల ఆశయ సాదనకు కృషి చేస్తూ ఉజ్వల భవిష్యత్ ను సొంతం చేసుకోవాలన్నారు. తాను ఎంచుకున్న లక్ష్యం మేరకు నడుచుకుంటేనే పట్టువదలకుండా పోటీ తత్వంతో ముందుకు పోయి జిల్లా జడ్జీ స్థానం సంపాదించుకుని ఈ స్థానంలో ఉన్నానని ఉదహరించారు. విద్యార్థులుగా మంచి ఆరోగ్యం సొంత చేసుకునేలా మేదిలితే మెగా రక్తదాన కార్యక్రమం మహిళలుగా చేపడుదామని విద్యార్థులను ఒప్పించారు.
న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జడ్జి కె. స్వప్నారాణి మాట్లాడుతూ.. సమాజంలో నిలదొక్కుకునేలా న్యాయ పరమైన ఇబ్బుందులు రాకుండా మెదులుతూ విజ్ఞానం సంపాదించుకుని మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలన్నారు. చట్టపరిధిలో ఇబ్బందులను చూసుకుని ముందుకు సాగితే భవిష్యత్ లో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావని సూచించారు.
ప్రేమ వివాహాల విషయంలో మేజర్ అయ్యేంత వరకు ఎలాంటి వివాహాలు చేసుకున్నా అనేక చిక్కుల్లో పడుతారని అలాంటి వాటికి దూరంగా ఉండాలని న్యాయబద్దంగా మెదలుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో భాను, న్యాయవాదులు హనుమాన్ సింగ్ బర్ల రమేష్ బాబు, ఝాన్సీ , శరత్ కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.శ్రీనివాస్ , విద్యార్థులు పాల్గొన్నారు.