 
                                                            సుల్తానాబాద్, అక్టోబర్ 30: మొంథా తుపాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా నిలువాలని, పరిహారం అందించి ఆదుకోవాలని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి డిమాండ్ చేశారు. వర్ష బీభత్సంతో సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్లోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం నీటిపాలు కాగా, గురువారం ఆయన పరిశీలించారు. రైతులను పరామర్శించి అధైర్యపడవద్దని, అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఈ సందర్భంగా మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఆయనవెంట నాయకులు పాల రామారావు, రాజమల్లయ్య, తాళ్ళపెల్లి మనోజ్‌గౌడ్, జూపెల్లి సందీప్‌రావు, క్యాదాసి చంద్రమౌళి, సూరశ్యాం, తిప్పారపు దయాకర్, గుడుగుల సతీశ్, కొయ్యడ అరుణ్, గోట్టం మహేశ్, సర్వర్, రఫిక్ ఉన్నారు.
 
                            