koppula Eswar | పెగడపల్లి: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం సాధించాలని ఆ పార్టీ పెగడపల్లి మండల శాఖ అధ్యక్షుడు లోక మల్లారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పెగడపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరించి, కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సహకారంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామంలో లక్షలాది రూపాయల నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు. చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు మల్లారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.