Vemulawada | బంగారం విక్రయ దుకాణాల నిర్వాకంతో ఉపాధి కోల్పోతున్నాం.. వేములవాడలో నిరసన వ్యక్తం చేసిన స్వర్ణకారులు
వేములవాడ పట్టణంలో బంగారం విక్రయిస్తున్న దుకాణాల నిర్వాకంతో తాము ఉపాధి కోల్పోతున్నామని వేములవాడ పట్టణ స్వర్ణకారులు తమ దుకాణాలను సోమవారం బంద్ చేసి నిరసన వ్యక్తం చేశారు.
Vemulawada | వేములవాడ, మే 4 : వేములవాడ పట్టణంలో బంగారం విక్రయిస్తున్న దుకాణాల నిర్వాకంతో తాము ఉపాధి కోల్పోతున్నామని వేములవాడ పట్టణ స్వర్ణకారులు తమ దుకాణాలను సోమవారం బంద్ చేసి నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు గిన్నెల శ్రీనివాస్ మాట్లాడుతూ పట్టణంలోని జ్యువెలరీ దుకాణాల యజమానులు వారి వద్ద బంగారం కొనుగోలు చేసే వినియోగదారులకు తామే ఆభరణాలు కూడా తక్కువ ధరకు తయారు చేసి ఇస్తామంటూ తమ ఉపాధిపై పొట్ట కొడుతున్నారని వాపోయారు.
బంగారం విక్రయించే వరకు బాగానే ఉన్నా తమ పనిని కూడా వారే తీసుకొని మాకు ఉపాధి లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. వారి వైఖరి మార్చుకోకుంటే తాము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పట్టణ స్వర్ణకారుల సంఘం ప్రధాన కార్యదర్శి కత్రోజు వెంకటేష్, రాము, ప్రసాద్, శంకరయ్య, కట్ట రమేష్, రాజేష్, అరుణ్, సాయి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

