Dharmaram | ధర్మారం, జూన్ 20 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని ప్రభుత్వ కళాశాలకు కళాశాల పూర్వ విద్యార్థులు నీటి ట్యాంక్ ను బహూకరించారు. గతంలో ఈ కళాశాలలో చదువుకున్న విద్యార్థులు కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పరచుకొని కళాశాలకు ట్యాంకును ఉచితంగా బహుకరించడానికి తమ వంతుగా విరాళాలు రూ.14వేలు విరాళాలు పోగు చేశారు. దీంతో 2వేల లీటర్ల సామర్థ్యం గల ఫైబర్ నీటి ట్యాంక్ ను కొనుగోలు చేసి శనివారం కళాశాల ప్రిన్సిపాల్ దురిశెట్టి అనంత రామకృష్ణ కు పూర్వ విద్యార్థులు అందజేశారు.
కళాశాలలో చదువుకొని జ్ఞాపకార్థంగా పూర్వ విద్యార్థులు నీటి సౌకర్యం కోసం నీటి ట్యాంకును బహూకరించడం ఆనందదాయకంగా ఉందని ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ప్రధాన కార్యదర్శి గోళ్లే మహేష్, కోశాధికారి కాల్వ నాగరాజు, సభ్యులు జాడి రాజశేఖర్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.