తిమ్మాపూర్, ఆగస్టు 25: గురుకులంలో సీటు వస్తే పిల్లలు బాగా చదువుకుంటారని తల్లిందండ్రులు హాస్టల్లో వేస్తే.. అక్కడ మాత్రం సమస్యలతో విద్యార్థులు తల్లడిల్లిపోతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీలోని మహాత్మాజ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో 450మంది విద్యార్థులు ఉన్నారు.
ఆదివారం సాయంత్రం డైనింగ్హాల్లో తోటి మిత్రులకు విద్యార్థులే అన్నం వడ్డించగా, కేవలం ఒకే ఒక్క ఉపాధ్యాయురాలు పర్యవేక్షించింది. ప్రతిరోజూ సిబ్బంది కేవలం వంట చేసి వెళ్లిపోతారని, తర్వాత తామే వంట గంజులు మోసుకుని.. డైనింగ్హాల్లో పెట్టుకుని అందరికీ వడ్డిస్తామని క్లాస్ లీడర్స్ చెబుతున్నారు. గతంలో చదువు, భోజనం బాగుండేవని.. ప్రస్తుతం గురుకులాల్లో సమస్యలతో పిల్లలు ఉండే పరిస్థితి లేదని ఏడో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.