
Godavarikhani | గోదావరిఖని : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రవ్యాప్తంగా ఆటోడ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, వీహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వ్యాల్ల హరీష్ రెడ్డి అన్నారు. గోదావరిఖని మార్కండేయ కాలనీలోని శ్రీలక్ష్మి ఫంక్షన్ హాల్ లో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బర్త్ డే సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఆర్థిక చేయూత అందిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత ప్రయాణం ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్లకు జీవనోపాధి లేకుండా చేశారని అన్నారు. వారికి ఏడాదికి రూ.12వేలు ఇస్తానని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖం చాటేశాడని అన్నారు. అంతేగాకుండా ఆటో సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని గాలికి వదిలేశాడని అన్నారు.
ఇదే క్రమంలో రేపటి కేటీఆర్ బర్త్ డే సందర్భంగా ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి రామగుండం ప్రాంతంలోని మరణించిన ఆటో డ్రైవర్లు, అనారోగ్యంతో ఉన్న 42 కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున మొత్తం రూ.4లక్షల 20 వేల చెక్కులను అందిస్తున్నామన్నారు. కేటీఆర్ బర్త్ డే సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అన్ని వర్గాల అభ్యున్నతికి సహకారం అందిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కౌశిక్ హరి, మాజీ ఎంపీపీ వ్యాల్ల అనసూయ రామిరెడ్డి, బీఆర్ఎస్ మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ మేకల సమ్మయ్య యాదవ్, బీఆర్ఎస్ కార్పొరేటర్లు కర్క సుజాత, తోకల రమేష్, శ్రీరామోజు మహేష్ నిమ్మరాజుల రవి, ఎండీ జాహిద్ పాషా, పోలాడి శ్రీనివాసరావు, రవి నాయక్, బూరుగు వంశీకృష్ణ, ఉదయ్, నూతి రాజ్ కుమార్, కరాటే రాములు, కొండ సురేష్, పోయిల రవి, మాజీ కార్పొరేటర్లు, మాజీ సర్పంచులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.