Godavarikhani | రామగుండం నియోజకవర్గంలో ఈఎస్ఐ ఆస్పత్రిని నిర్మించాలి.. స్వచ్ఛంద సంఘాల డిమాండ్
రామగుండం నియోజకవర్గంలో వంద పడకల ఈఎస్ఐ ఆస్పత్రిని నిర్మించాలని స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్వచ్ఛంద సంఘాల ఐక్య వేదిక నాయకులు గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో శుక్రవారం సంతకాల సేకరణ చేపట్టారు.
Godavarikhani | కోల్ సిటీ, జూలై 17 : రామగుండం నియోజకవర్గంలో వంద పడకల ఈఎస్ఐ ఆస్పత్రిని నిర్మించాలని స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్వచ్ఛంద సంఘాల ఐక్య వేదిక నాయకులు గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో శుక్రవారం సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా వేదిక ప్రతినిధులు మద్దెల దినేష్, గోలివాడ చంద్రకళ, ఐత శివకుమార్ మాట్లాడుతూ రామగుండం నియోజక వర్గంలో వంద పడకల ఆస్పత్రి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.150 కోట్లు మంజూరు చేసిందని గుర్తు చేశారు.
ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆస్పత్రి నిర్మాణంకు స్థల సేకరణలో తీవ్ర జాప్యం జరుగుతోందని మండిపడ్డారు. దీనితో అసంఘటిత రంగ కార్మికులు వైద్య సేవలకు నోచుకోవడం లేదన్నారు. వివిధ పరిశ్రమలకు నిలయంగా ఉన్న రామగుండంలో గల వేలాది మంది అసంఘటిత కార్మికులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమార్థం త్వరితగతిన ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణం చేపట్టాలని కోరారు.
2018 జనవరి 31 లోపు డీపీఆర్ తయారు చేసి నిర్మాణం చేయకపోతే నిధులు వెనక్కి పోతాయని స్పష్టం చేశారు. రీజనల్ కమిషనర్ స్పందించి వెంటనే నిర్మాణంకు చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం వందల సంఖ్యలో యువతీ, యువకులు, కార్మికులు సంతకాలు చేశారు. కార్యక్రమంలో లంక సురేష్, టీ. రమేష్ కుమార్, లెనిన్, ఎంఏ. గౌస్, కంకటి రవి గౌడ్, ఇందారపు సునీత, గాదం సరిత, లక్ష్మీ, కొండు రమాదేవి, సుశీల, జనగామ జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

