Sadbhavana Yatra | రాజీవ్ గాంధీ సద్భావన యాత్రతో ట్రాఫిక్ తిప్పలు
Sadbhavana Yatra | రాజీవ్ సద్భావన యాత్ర వల్ల ట్రాఫిక్ తిప్పలు ఏర్పడ్డాయి. దీనివల్ల నారాయణపేట జిల్లా వాసులు ఇబ్బందులు పడ్డారు.
Sadbhavana Yatra | నారాయణపేట: రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర నారాయణపేట (Narayanapeta) జిల్లాకు చేరింది. కర్ణాటకలోని రాయచూర్ జిల్లా నుంచి కృష్ణ మండలం రోడ్డు మీదుగా మక్తల్ చేరుకుంది. ఈ యాత్రకు కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో స్థానిక నాయకులు స్వాగతం పలికారు. మధ్యాహ్నం 12.40 గంటలకు మక్తల్ అంబేద్కర్ చౌరస్తాకు యాత్ర చేరుకుంది. మున్సిపల్ చైర్మన్, పలువురు కౌన్సిలర్లు ఏర్పాట్లు చేశారు.
యాత్ర కారణంగా జాతీయ రహదారిపై (National Highway) భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్టాండ్‌తో పాటు పడమటి ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లే మార్గంలో పూర్తిగా ట్రాఫిక్ ఏర్పడింది. అసలే అమావాస్య కావడంతో మక్తల్ లో ప్రసిద్ధి గాంచిన శ్రీ పడమటి ఆంజనేయ స్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు. భక్తులు సైతం ట్రాఫిక్‌లో చిక్కుకుని అవస్థలు పడ్డారు. సద్భావన యాత్రకు స్వాగతం పలికే కార్యక్రమం ప్రజలకు అసౌకర్యంగా మారడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
కమీషన్ల సొమ్ము దాచుకునేందుకే ఎమ్మెల్యే కడియం విదేశీ యాత్రలు : తాటికొండ రాజయ్య
Cancer Prevention | క్యాన్సర్ నివారణ అంటే పొగ తాగడం, మద్యం మానేయడం కాదు.. వీటిని కూడా పాటించాలి..
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

