Godavarikhani | కోల్ సిటీ, మార్చి 29 : రామగుండం నగర పాలక సంస్థ 7వ డివిజన్ జీఎం కాలనీలో శ్రీ సూరపనేని అనుదీప్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన వృత్తి శిక్షణా తరగతులు ముగిశాయి. ఈమేరకు ఆదివారం డివిజన్ కార్పొరేటర్ వేగోళపు రమాదేవి శ్రీనివాస్ చేతుల మీదుగా మహిళలకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆదాయంతోనే మహిళల్లో ఆత్మస్థైర్యం పెంపొందుతుందని పేర్కొన్నారు.
సాధారణ గృహిణులకు స్వయం ఉపాధి కల్పించేందుకు ట్రస్టు చైర్పర్సన్ శశికళ వ్యయ, ప్రయాసాలకోర్చి బుట్టల తయారీ, అల్లికలపై తర్పీదు ఇప్పించడం అభినందనీయమన్నారు. శిక్షణ కాలంలో నేర్చుకున్న మెళకువలతో మహిళలు వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు సొంత యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలని ట్రస్టు నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు చైర్పర్సన్ శశికళ, బత్తుల పోచం, జంగిలి రాజేశ్, జనగామ వినోద్, అంజన్న, రాజు, నాగరాజు, సంజీవ్తోపాటు మహిళలు పాల్గొన్నారు.