దక్షిణాది లేడీ సూపర్‌స్టార్‌గా అభివర్ణించే నయనతార ప్రస్తుతం ఎనిమిది సినిమాలతో బిజీగా ఉంది. కథానాయికగా కెరీర్ మొదలుపెట్టి ఇరవై మూడేండ్లు గడుస్తున్నా ఆమెకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఒక్కో సినిమాకు 15కోట్ల వరకూ రెమ్యునరేషన్ అందుకుంటూ దక్షిణాదిలోనే అగ్రస్థానంలో కొనసాగుతున్నది. తాజాగా నయనతార చెన్నైలోని పోయెస్ గార్డెన్ ఏరియాలో 40కోట్ల ఖరీదైన విల్లాను కొనుగోలు చేసింది.
రజనీకాంత్, ధనుష్‌తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివసించే పోయెస్ గార్డెన్లో నయనతార ఇల్లు కొనుగోలు చేయడం చెన్నై సినీవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. త్వరలో కుటుంబంతో కలిసి నయనతార ఈ ఇంటిలోకి మారబోతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆమె యశ్ ‘టాక్సిక్’తో పాటు బాలీవుడ్లో సల్మాన్‌ఖాన్‌తో కలిసి ఓ చిత్రంలో నటిస్తున్నది. నయనతార తాజా చిత్రం ‘హాయ్’ ఆగస్ట్ 14న విడుదలకు సిద్ధమవుతున్నది.