Godavarikhani | జ్యోతినగర్, జనవరి 25: చారిత్రక గుర్తింపు కలిగిన ప్రదేశాల సందర్శనతో విద్యార్థులకు విజ్ఞానం, నైపుణ్యతను పెంపొందించవచ్చని విశ్వభారతి విద్యాసంస్థల యాజమాన్యం ఎన్టీపీసీలోని విశ్వభారతి స్కూల్ విద్యార్థులను సౌత్ ఇండియాలో చారత్రక ప్రదేశాలు కర్ణాటక, తమిళనాడు స్టడీ విహారయాత్రకు తీసుకువెళ్లారు. అక్కడ విద్యార్థులు ఉల్లాసంగా ఉత్సహంగా అహ్లదకరమైన వాతావరణంలో గుర్తింపు కలిగి ప్రదేశాలను ప్రత్యేక్షంగా చూసి వాటి చరిత్రను అవగాహన చేసుకుంటున్నారు.
బెంగళూర్, మైసూర్ లో విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజీ మ్యూజియం, మైసూర్ ప్యాలెస్, ఊటిలో బొటానికల్ గార్డెన్, టీ చాక్లెట్ ఫ్యాక్టరీ, దొడ్డబెట్ట శిఖరం, అధ్యాత్మిక ప్రదేశాలు ఇస్కాన్ టెంపుల్, శ్రావణ బెళగొళ, హళేబీడు, బేలూర్ చేన్నకేశవ దేవాలయాలు, చాముండి కొండలు, బృందావన్ గార్డెన్ సందర్శనతో ఆహ్లాదకరమైన వాతావరణంలో గత ఐదు రోజులుగా విద్యార్థులకు వాటి విశిష్టత, చరిత్రపై స్కూల్ ప్రిన్సిపాల్ ప్రవీణ్ కుమార్, హెచ్ఎం తిరుపతిగౌడ్, అధ్యాపకులు అవగాహన కల్పిస్తున్నారు.