కమాన్ చౌరస్తా, జూలై 29: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అద్విత ఇంటర్నేషనల్ పాఠశాల తొమ్మిదో తరగతి విద్యార్ధి వై. విశ్వక్ సేన్ జాతీయ స్థాయి కరాటే పోటీలో అత్యుత్తమ విజయం సాధించి గ్రాండ్ చాంపియన్గా ఎంపికయ్యాడు. ఈ క్రమంలో పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ అనుదీప్ సౌగాని విద్యార్థిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మెదక్ లో జరిగిన ప్రతిష్టాత్మక జాతీయ కరాటే చాంపియన్ షిప్లో వైట్ టూ బ్లాక్ బెల్ట్ కేటగిరీ- కాటా విభాగంలో విశ్వక్ సేన్ గ్రాండ్ చాంపియన్ షిప్ టైటిల్ ను అతను గెలుచుకున్నాడన్నారు.
ఈ కార్యక్రమంలో దేశంలోని అత్యుత్తమ మార్షల్ ఆర్టిస్టుల మధ్య ఈ పోటీ జరగగా విశ్వక్ విజయం అతని క్రమశిక్షణ, పట్టుదల, కరాటే పట్ల ఉన్న ఆసక్తికి నిదర్శనం అన్నారు. విద్యలోనే కాదు, ఇతర సహపాట్య కార్యక్రమాలలోనూ విశ్వక్ తన నిబద్ధతను నిరూపిస్తూ వచ్చాడన్నారు. అతని విజయం కుటుంబానికి, పాఠశాలకే కాకుండా, మొత్తం కరీంనగర్ నగరానికి గర్వకారణం అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మాధురి స్వేత, వైస్ ప్రిన్సిపాల్ దివ్య, ఉపాధ్యాయులు విశ్వక్ ను అభినందించడంతో పాటు, అతని కోచ్, తల్లిదండ్రులకు ప్రత్యేకంగా అభినందించారు.