Vishwajanani Seva Ratna Award | చిగురుమామిడి, ఆగస్టు 3: చిగురుమామిడి మండలం రేకొండ గ్రామానికి చెందిన మాడ సునీల్ రెడ్డి అనే డబ్బింగ్ ఆర్టిస్ట్ కు విశ్వజనని ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందించే విశ్వజనని సేవా రత్న అవార్డు కు ఎంపికయ్యారు. ఈనెల 20న హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో విశ్వజననీ ఫౌండేషన్ మూడో వార్షికోత్సవం సందర్భంగా ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. సునీల్ రెడ్డి సామాజిక రంగంతోపాటు, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా 20 సంవత్సరాలుగా సేవలందిస్తున్నారు.
కొంతకాలం సినీ రంగంలో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పనిచేసి, ప్రస్తుతం టీ న్యూస్ చానల్లో డబ్బింగ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నాడు. ఇతడు అవార్డుకు ఎంపిక అవడం పట్ల సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి, సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు చాడ శ్రీధర్ రెడ్డి, వివిధ పార్టీల నాయకులు మామిడి అంజయ్య, దాసరి ప్రవీణ్, బిళ్ల వెంకట్ రెడ్డి, చాడ వేణుగోపాల్ రెడ్డి, రోంటాల లావణ్య, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. కాగా విశ్వజనని సేవరత్న అవార్డును ఎంపిక చేయడం పట్ల అవార్డు గ్రహీత మాడ సునీల్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. వివిధ సేవా సంస్థలు ఎన్నో అవార్డులు అందచేసినప్పటికీ ఈ అవార్డు తనకి ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని అన్నారు.