చిగురుమామిడి, సెప్టెంబర్ 23: బీసీ సంక్షేమ సంఘం కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన చెల్పూరి విష్ణుమాచారిని నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు నాగుల కనకయ్య గౌడ్ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు నియామకవత్రం అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా జిల్లా కార్యదర్శిగా నియామకమైన విష్ణమాచారి మాట్లాడుతూ.. బీసీ సంక్షేమ సంఘం నియమ నిబంధనలకు లోబడి పని చేస్తానని, బీసీ సంఘాల బలోపేతం కోసం కృషి చేస్తానన్నారు.
బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగడతానని పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గీకురు రవీందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ రాచమల్ల రాజు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్ర శ్రీనివాస్ కు విష్ణుమాచారి కృతజ్ఞతలు తెలిపారు.