కరీంనగర్ కమాన్చౌరస్తా, సెప్టెంబర్ 14 : నవరాత్రోత్సవాల్లో భాగంగా నగరంలోని విద్యానగర్లో వినాయకుడిని కరెన్సీతో అలంకరించారు. ప్యారిస్ లైన్ శ్రీ ఉమాపుత్ర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 35.60 లక్షల నోట్లతో మండపాన్ని సుందరంగా తీర్చిదిద్దారు.
ఈ అలంకరణ ఆదివారం వరకు ఉంటుందని ఉత్సవ కమిటీ చైర్మన్ కోట సతీశ్ కుమార్ తెలిపారు. గతేడాది 20 లక్షల కరెన్సీతో అలంకరించినట్టు గుర్తు చేశారు.