Chigurumamidi | చిగురుమామిడి, సెప్టెంబర్ 3 : చిగురుమామిడి మండలంలోని రామంచ గ్రామంలో పులి నారాయణ హమాలి కార్మికుడు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురికాగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. వారి కుటుంబం పూర్తిగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవడంతో గ్రామానికి చెందిన గుంటి ఎల్లయ్య 50 కిలోల బియ్యం, నర్రా మాధవరెడ్డి నిత్యవసర వస్తువులను బుధవారం కుటుంబ సభ్యులకు అందజేశారు.
నారాయణ పూర్తి నిరుపేద కావడంతో తినడానికి కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొందని ముగ్గురు ఆడపిల్లలు పోషించలేని పరిస్థితిలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడని వారన్నారు. వారి కుటుంబానికి దాతలు ముందుకు వచ్చి సహకారం అందించాలని వారు కోరారు. వీరి వెంట గ్రామస్తులు కూతురు మల్లారెడ్డి, కొండ లింగయ్య, పైస మల్లయ్య కుటుంబ సభ్యులు ఉన్నారు.