Dharmaram | ధర్మారం, ఫిబ్రవరి 21 : గ్రామాల అభివృద్ధి అందరి బాధ్యత అని మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ దయా అరుణ అన్నారు. ధర్మారం మండల పరిషత్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యుల శిక్షణ తరగతుల కార్యక్రమంలో భాగంగా శనివారం మహిళా శిశు సంక్షేమ అధ్యర్యంలో నిర్వహించారు. కొత్తగా ఎన్నికైన వార్డు సభ్యులు గ్రామాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని ఆమె సూచించారు .ఈ సందర్భంగా అరుణ మహిళా శిశు సంక్షేమ శాఖ సేవల గురించి వార్డు సభ్యులకు అవగాహన కల్పించారు.
పుట్టబోయే బిడ్డ నుండి వృద్ధులకు అందుబాటులో ఉన్న సేవలు వాటి వినియోగం, బాలల హక్కులు, రక్షణ, మహిళ చట్టాలు, బాల్య వివాహాలు, లింగ నిరోధిక వ్యతిరేక చట్టం, వంటి అంశాల పైన గ్రామాభివృద్ధి గురించి సూచించారు. ఏసీడీపీవో సంపద కుమారి మాట్లాడుతూ అంగన్వాడి సేవలు గ్రామస్తులకు వందే విధంగా వాటి సభ్యులు చేయాలని ఆమె తెలిపారు. బాలల రక్షణ ల్, సంరక్షణ సేవల గురించి 1098 సూపర్వైజర్ సంతోష్ వివరించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ అంగన్వాడీ సూపర్వైజర్లు బ్లాండినా, కె. భాగ్య లక్ష్మి, ఈజీఎస్ ఏపీవో రవి తదితరులు పాల్గొన్నారు.