Peddapally| పెద్దపల్లి రూరల్ మే25: ప్రభుత్వం గ్రామాల్లో రెవెన్యు వ్యవస్థను నడిపించేందుకు గాను గ్రామపాలన అధికారుల నియామకానికి కసరత్తును చేపట్టింది. వీటికంటే ముందు గతంలో వివిద శాఖల్లో కుదింపు చేసిన వీఆర్ వోలనే వెనక్కి తెచ్చుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయం ఏమైదో ఏమోగాని ప్రస్తుతం జిల్లాల్లో గ్రామాల వారిగా గ్రామపాలన అధికారుల నియామకానికి చర్యలను ముమ్మరం చేసింది.
ఇందులో భాగంగా ఆదివారం ప్రభుత్వం నిర్ణయించిన ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లాలో గ్రామాలకు అవసరమున్న 90మందికి పరీక్షలు జరిపేలా పెద్దపల్లి మండలం పెద్దకల్వల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాట్లు చేశారు. పరీక్షలకు 90 అభ్యర్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 82 మంది హాజరు కాగా 8 మంది గైర్హాజరయ్యారు.
పరీక్షా కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ దాసరి వేణు సందర్శించి పరిశీలించారు. ఆయన వెంట చీఫ్ సూపరింటెండెంట్ , ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీనర్సయ్య, అబ్జర్వర్ డాక్టర్ జి. పురుషోత్తం, తదితరులు పాల్గొన్నారు.