VAO Exam | పెద్దపల్లి, మే24: గ్రామ పాలన అధికారి పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ దాసరి వేణు సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో గ్రామ పాలన అధికారి పరీక్ష నిర్వహణపై సంబంధిత అధికారులతో శనివారం సమావేశమై మాట్లాడారు. ఆదివారం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1: 30 గంటల వరకు పెద్దకల్వల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగే పరీక్షకు జిల్లాలోని 90 మంది అభ్యర్థులు హాజరవుతారని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రంలోకి మొబైల్ అనుమతి లేదన్నారు.
పరీక్ష కేంద్రం గేటు ఉదయం 10 గంటలకు మూసివేయాలని, గేటు మూసివేసిన తర్వాత అభ్యర్థులనులోనికి అనుమతించవద్దని స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రం సమీపంలోని జిరాక్స్ షాపులను మూసివేయాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీవో బీ గంగయ్య, కలెక్టరేట్ ఏవో శ్రీనివాస్, కలెక్టరేట్ సీ విభాగం సూపరింటెండెంట్ బండి ప్రకాష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.