Veenavanka | వీణవంక, జనవరి 07: ఉప సర్పంచుల ఫోరం వీణవంక మండల అధ్యక్షుడిగా వల్బాపూర్ ఉప సర్పంచ్ నామిని విజేందర్, ప్రధాన కార్యదర్శిగా హిమ్మత్‌నగర్ ఉపసర్పంచ్ మ్యాక శ్రీనివాస్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కేంద్రంలో ఉపసర్పంచులు ప్రత్యేక సమావేశమై బుధవారం కమిటీని ఎన్నుకున్నారు. అనంతరం విజేందర్ మాట్లాడుతూ ఉప సర్పంచ్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, తన ఎన్నికకు సహకరించి ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, సర్పంచులు అందే శ్రీమతి, జడల శ్రీకాంత్, అప్పాల తిరుమల, ఉప సర్పంచులు ఉయ్యాల రాజు, మడ్డి మహేష్, గాజుల రవి, గొల్లపల్లి అనిల్, మాదాసి సంపత్, ఇల్లందకుంట దేవస్థానం ధర్మకర్త జున్నుతుల మధుకర్ రెడ్డి, నాయకులు ఎండీ సాహెబ్ హుస్సేన్, తిరుపతి రెడ్డి, రాసపెల్లి సంపత్, జగన్ రెడ్డి, వావినీల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.