రామగుండం : దసరా పండుగ సందర్భంగా రామగుండం కమిషనరేట్లో గురువారం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా(Amber Kishore Jha) ఆయుధ( Arms ), వాహన పూజలు ( Vehicle Puja) , దుర్గా దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయదశమి పండుగ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి , మంచిర్యాల్ జోన్ల ప్రజలకు, అధికారులకు, సిబ్బందికి అన్ని రంగాలలో విజయం చేకూర్చాలని ఆకాంక్షించారు.
శక్తికి ప్రతీకగా నిలిచే దుర్గామాత సమక్షంలో ప్రతి ఆయుధానికి ఎంతో శక్తి కలిగి ఉంటుందని అలాంటి విజయాలను చేకూర్చే విజయదశమి పర్వదినోత్సవం అందరికి సుఖ సంతోషాలు కలిగించాలని ఆకాంక్షించారు. పోలీస్ శాఖలో ప్రతి స్థాయిలోని అధికారి ప్రజా రక్షణలో ముందుండాలని, అందరి మన్ననలు అందుకుంటూ పోలీస్ శాఖ గౌరవం, రామగుండం పోలీస్ కమిషనరేట్ స్థాయి మరింత పెరిగేలా పని చేయాలన్నారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి పండుగను జరుపుకుంటారని అన్నారు. సమాజంలో చెడును పారద్రోలేందుకు పోలీసు విభాగం కృషి చేస్తుందని తెలిపారు. అనంతరం వాహనాల పూజ నిర్వహించి అందరికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్, గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ భీమేష్, రాజేంద్ర ప్రసాద్,ఆర్ఐ దామోదర్, శ్రీనివాస్, మల్లేశం, వామన మూర్తి, సంపత్, సిసి హరీష్, ఎస్ఐ, ఆర్ఎస్ఐ లు, డ్రైవర్లు, స్పెషల్ పార్టీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.