Jagityal | సారంగాపూర్, మే 29: సారంగాపూర్ మండలంలోని పెంబట్ల, లక్ష్మీదేవి పల్లి గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను మండల కోఆర్డినేటర్, జిల్లా విజిలెన్స్ అధికారి దేవేందర్ రెడ్డి పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఆయా గ్రామాల్లో చేపడుతున్న కందకాల పనులు కొలతలు పరిశీలించారు.
ఈ సందర్భంగా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ కూలీలకు రూ.307 పడే విధంగా పనిచేయాలని సూచించారు. ఉపాధి హామీ సిబ్బందికి అగ్రి అలైడ్ వర్క్, వ్యక్తిగత పనుల ప్రోగ్రెస్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ శ్రీలత, టీఏ స్వప్న, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.