Vidya Ratna Award | జ్యోతినగర్, ఏప్రిల్ 20 : ఎన్టీపీసీలోని విశ్వభారతి విద్యాసంస్థల చైర్మన్ బంధారపు యాదగిరి గౌడ్‌కు బహుజన సాహిత్య అకాడమీ(బీఎస్ఏ) నుంచి జాతీయ అవార్డు లభించింది. గత 34 ఎళ్లుగా విద్యారంగంలో రాణిస్తున్న విశ్వభారతి విద్యాసంస్థల సేవలను గుర్తించిన బహుజన సాహిత్య అకాడమీ సంస్థ 9వ తెలంగాణ స్టేట్ కాన్ఫరెన్స్‌ను పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న వారికి ఆదివారం రాత్రి హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో విశ్వభారతి విద్యాసంస్థల చైర్మన్ బంధారపు యాదగిరిగౌడ్‌కు బీఎస్ఏ జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ విద్యారత్న పురస్కారాన్ని అందజేశారు.
ఈ పురస్కారం లభించడం పట్ల యాదగిరిగౌడ్ విద్యారంగం సేవలపై మరింత బాధ్యత పెరిగిందని ఆనందం వ్యక్తం చేశారు. అవార్డు పట్ల విశ్వభారతి విద్యాసంస్థల హెచ్ఎం తిరుపతిగౌడ్, ప్రిన్సిపాల్ ప్రవీణ్‌కుమార్, ఉపాధ్యాయులు, ట్రస్మా నాయకులు, బీఎస్ఏ జిల్లా బాధ్యులు బాదే వెంకటేశం హర్షం వ్యక్తం చేశారు.