Karimnagar | కార్పొరేషన్, జూన్ 25 : కరీంనగర్ నగరపాలక సంస్థలోని సీతారాంపూర్ ప్రాంతంలో రోడ్డు స్థలాన్ని కబ్జా చేసి అంటే నిర్మాణం చేపడుతున్నారని, న్యాయం చేయాలని కోరుతూ ఈ ప్రాంతానికి చెందిన సాగి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి బుధవారం వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు.
రోడ్డు కబ్జా చేసి నిర్మాణం చేస్తున్నారని పలుమార్లు నగరపాలక సంస్థ అధికారులు, కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమంలో విన్నవించినా ఎలాంటి స్పందన లేదని బాధితుడు ఆరోపించారు. తనకు న్యాయం జరిగేంతవరకు వాటర్ ట్యాంక్ దిగేది లేదని భీష్మించి కూర్చున్నారు. నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు, పోలీసులు వచ్చి బాధితుడిని సముదాయించి కిందకు దించారు.