Veterinary camps | చిగురుమామిడి, డిసెంబర్ 27: శీతాకాలంలో పశుపోషకులు పశువుల పెంపకంలో జాగ్రత్తలు తీసుకోవాలని చిగురుమామిడి, ఇందుర్తి పశువైద్యాధికారులు తుమ్మల శ్రీనివాస్ రెడ్డి, కే సాంబరావు అన్నారు. బొమ్మనపల్లి, ఓగులాపూర్ గ్రామాల్లో శనివారం మేకలు, గొర్రెలకు నట్టల నివారణ మందులు వేశారు. మూగజీవాలకు శీతాకాలంలో వచ్చే నట్టలతో శరీర ఎదుగుదల లోపించి రోగాల బారిన పడతాయన్నారు.
రోగాలను ముందస్తుగా నివారించడానికి నట్టల నివారణ మందులు వేయించాలన్నారు. బొమ్మనపల్లి లో 2400, ఓగు లాపూర్ లో 466 పశువులకు నట్టల నివారణ మందులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బొమ్మనపల్లి, ఓగులాపూర్ సర్పంచ్ లు కొంకట మౌనిక, గడ్డం రమ, ఉప సర్పంచ్ శంకరి స్వరూప, సొసైటీ అధ్యక్షుడు చిగుళ్ల కొమురయ్య, వైద్య సిబ్బంది వేణుగోపాల్ రెడ్డి, జేరిపోతుల శ్రీనివాస్, సత్యం, యాదవ సంఘం సభ్యులు పాల్గొన్నారు.