
Gambhiraopet | గంభీరావుపేట ఏప్రిల్ 16 : గంబీరావుపేట మండల కేంద్రంలోని గురువారం అధికారులు నిర్వహించిన మండల స్థాయి ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక సమావేశంలో బీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల మధ్య ‘జై తెలంగాణ పలుకు’పై వాగ్వాదం చోటుచేసుకున్నది.
మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, బీఆర్ఎస్ సర్పంచు తన ప్రసంగం ముగించుకుని ‘జై తెలంగాణ’ అంటూ తన ప్రసంగం మొదలు పెట్టగా అక్కడే కాంగ్రెస్ నేతలు ‘అట్లా ఎందుకు అన్నావంటూ జై కాంగ్రెస్’ అని కాసేపు సభలో గందరగోళం చేశారు. దీంతో బీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల మధ్యన వాగ్వాదం జరిగింది.