Mallapur | మల్లాపూర్, సెప్టెంబర్ 12 : ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫర్ ప్రొడక్షన్ కౌన్సిల్ సంస్థ మల్లాపూర్ మండల అధ్యక్షుడిగా ఉత్తమరాజుపల్లి గ్రామానికి చెందిన ఇల్లందుల వేణుగోపాల చారి ఏకగ్రీవంగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆ సంస్థ జిల్లా అధ్యక్షుడు ఆడెపు రాజమౌళి శనివారం నియామక ఉత్తర్వులను జారీచేసి అందజేశారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షుడు వేణుగోపాలచారి మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం తనవంతుగా కృషి చేస్తానని, ఎన్నికల సహకరించిన ప్రతీ ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.