సివిల్ సైప్లె వర్సెస్ మిల్లర్స్!
రాష్ట్రంలో సివిల్ సైప్లె, రైస్ మిల్లర్ల మధ్య పోరు పతాక స్థాయికి చేరింది. ఈ పంచాయితీలో రైతులు బలిపశువులవుతున్నారనే విమర్శలొస్తున్నాయి. ఇద్దరి మధ్య నెలకొన్న పంచాయితీ ధాన్యం కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నది.
- ఎడతెగని పంచాయితీ.. రైతులు బలి – కొలికిరాని అగ్రిమెంట్ల వ్యవహారం
- మిల్లుల కేటాయింపులు లేక ధాన్యం కొనుగోళ్లకు బ్రేక్
- కొనుగోలు చేసిన ధాన్యం ఎకడదించాలో తెలియని దుస్థితి
- సేకరణ లక్ష్యం 60 లక్షల టన్నులు
- కొన్నది మాత్రం 40 వేల టన్నులే
హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సివిల్ సైప్లె, రైస్ మిల్లర్ల మధ్య పోరు పతాక స్థాయికి చేరింది. ఈ పంచాయితీలో రైతులు బలిపశువులవుతున్నారనే విమర్శలొస్తున్నాయి. ఇద్దరి మధ్య నెలకొన్న పంచాయితీ ధాన్యం కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. వరి కోతలు పూర్తిచేసిన రైతులు కొనుగోలు కేంద్రాలకు పెద్ద మొత్తంలో ధాన్యం తీసుకొస్తున్నారు. కానీ, ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి మిల్లర్లతో అగ్రిమెంట్ల పంచాయితీ ప్రధాన అడ్డంకిగా మారింది. వరి కోతలు మొదలై సుమారు నెల రోజులవుతున్నా ఇప్పటివరకూ సివిల్ సైప్లె విభాగానికీ, రైస్ మిల్లర్లకూ మధ్య అగ్రిమెంట్ల ప్రక్రియ పూర్తికాకపోవడం గమనార్హం. సివిల్సైప్లె విధించిన షరతులను వ్యతిరేకిస్తున్న మిల్లర్లు అగ్రిమెంట్ చేసుకునేందుకు ససేమిరా అంటున్నారు. ఆ నిబంధనలతోనే అగ్రిమెంట్ చేసుకోవాల్సిందేనని సివిల్ సైప్లె చెప్తున్నది. దీంతో ఇది ఎడతెగని పంచాయితీగా మారింది.
కొలిక్కిరాని అగ్రిమెంట్ల పంచాయితీ
కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని నిర్ణీత మిల్లులకు తరలించి, అకడ మిల్లింగ్ చేయించి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కింద బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. ఇందుకోసం సివిల్సైప్లె అధికారులు మిల్లర్లతో ముందుగానే ఒప్పందాలు చేసుకోవాలి. సీజన్ ప్రారంభానికి ముందే జరుగాల్సిన ఈ ప్రక్రియను పూర్తిచేయడంలో అధికారులు విఫలమయ్యారు. తీరా కొనుగోళ్ల సమయం వచ్చేసరికి అగ్రిమెంట్ల వ్యవహారం వివాదంగా మారింది. మిల్లుల కేటాయింపులు, ధాన్యం తరలింపు, నిల్వల నిర్వహణ అన్నీ ఒప్పందాలపైనే ఆధారపడటంతో ఈ జాప్యం కొనుగోళ్ల ప్రక్రియను దెబ్బతీస్తున్నది. ఒప్పందాలు జరగకపోవడం, పీపీసీ కేంద్రాలకు మిల్లులను లింకు చేయకపోవడంతో ధాన్యం దించుకునేందుకు మిల్లర్లు నిరాకరికిస్తున్నారు. దీంతో కొనుగోలు చేసిన ధాన్యం ఎక్కడ దించాలో తెలియని పరిస్థితి నెలకొన్నది.
షరతులపై మిల్లర్ల పేచీ
సీఎంఆర్ బియ్యం అప్పగింతలో గతంలో జరిగిన జాప్యాలు, బకాయిలు, అక్రమాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈసారి మిల్లర్లపై కఠిన నిబంధనలు విధించింది. ధాన్యం విలువకు అనుగుణంగా బ్యాంకు గ్యారెంటీలు సమర్పించడం, పాత సీఎంఆర్ బకాయిలను పరిషరించడం, ధాన్యం నిల్వలు, భద్రతకు బాధ్యత వహించడం వంటి అంశాలను ఒప్పందాల్లో పొందుపరిచింది. ముఖ్యంగా ఐదు రెట్లు సాల్వెన్సీ, 10% బ్యాంకు గ్యారెంటీ, అఫిడవిట్ ఇవ్వడం, అసోసియేషన్ గ్యారంటీని రద్దు చేయడం, రెండు మిల్లులతో గ్యారెంటీ ఇవ్వాలనే నిబంధన, మిల్లర్లు, గ్యారెంటీ మిల్లర్లు తమ ఆస్తుల వివరాలను తెలుపాలనే నిబంధనలు పెట్టింది. ఈ నిబంధనలపై మిల్లర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వాటిని మార్చాలని పట్టుబడుతున్నారు. షరతులు సడలిస్తేనే ఒప్పందాలు చేసుకుంటామని, లేనిపక్షంలో కొనుగోళ్లలో భాగస్వామ్యం కాలేమని మిల్లర్లు చెప్తున్నారు.
కొనుగోళ్లకు బ్రేక్… అన్నదాత అవస్థలు
సివిల్ సైప్లె, మిల్లర్ల మధ్య నెలకొన్న అగ్రిమెంట్ల పంచాయితీ కొలిక్కిరాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఇప్పటివరకూ ప్రభుత్వం 40వేల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేసిందంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం 8,283 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని చెప్పినప్పటికీ, ఇప్పటివరకూ ఐదు వేలలోపు కేంద్రాలను మాత్రమే ప్రారంభించినట్టు సమాచారం. వీటిలోనూ మెజారిటీ కేంద్రాల్లో ధాన్యం తూకం వేయడంలేదు. ప్రభుత్వ తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

