Siricilla | సిరిసిల్ల టౌన్, మే 22: సిరిసిల్లలోని శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో 7వ వార్షికోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. వార్సికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన శ్రీ వేంకటేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవం కనుల పండువగా జరిగింది.
వేద పండితులు వేద మంత్రోచ్చరణల మధ్య కల్యాణం జరిపించారు. భక్తులు భారీ సంఖ్యలో హాజరై వేడుకను తిలికించి పునీతులయ్యారు. అనంతరం ఆలయంలో భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మారుతిరావు, ఉప్పుల విఠల్ రెడ్డి, తీగల శేఖర్ గౌడ్, కోడం శ్రీనివాస్, గడప రమేష్ భక్తులు పాల్గొన్నారు.