Vemulawada | వేములవాడ, జనవరి 17 : వేములవాడ పురపాలక సంఘం చైర్మన్ రిజర్వేషన్ బీసీ జనరల్ కావడంతో పదేళ్ల తర్వాత పురుషులకు అవకాశం దక్కనుంది. మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న వేములవాడ 2011లో నగర పంచాయతీగా మార్చుతూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్న సమయంలో 2014లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీసీ మహిళకు చైర్ పర్సన్ పదవి దక్కింది.
నామాల ఉమా చైర్ పర్సన్ పదవిని దక్కించుకున్నారు. విలీన గ్రామాలతో కలిపి 28 వార్డులుగా ఏర్పాటు చేయగా 2020 జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మళ్లీ బీసీ మహిళకే చైర్ పర్సన్ పదవిని రిజర్వేషన్ కాగా రామతీర్థపు మాధవి పదవి దక్కించుకున్నారు. తాజాగా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వేములవాడ పురపాలక సంఘాన్ని బీసీ జనరల్ స్థానంగా కేటాయించడంతో పదేళ్ల తర్వాత పురుషులకు అవకాశం కలిసి వచ్చింది.
28 వార్డులకు రిజర్వేషన్లు ఖరారు
పురపాలక సంఘంలోని వార్డులకు రిజర్వేషన్లను జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరీమ అగ్రవాల్ శనివారం ప్రకటించారు. వేములవాడ పురపాలక సంఘానికి సంబంధించిన వార్డుల వారి రిజర్వేషన్లు ఉన్నాయి..
1వ వార్డు: బీసీ మహిళ
2వ వార్డు: జనరల్ మహిళ
3వ వార్డు: ఎస్సీ మహిళ
4వ వార్డు: జనరల్
5వ వార్డు: జనరల్ మహిళ
6వ వార్డు: జనరల్
7వ వార్డు: జనరల్
8వ వార్డు: బీసీ జనరల్
9వ వార్డు: జనరల్ మహిళ
10వ వార్డు: జనరల్ మహిళ
11వ వార్డు: బీసీ మహిళ
12వ వార్డు: ఎస్టి జనరల్
13వ వార్డు: ఎస్సీ మహిళ
14వ వార్డు: జనరల్
15వ వార్డు: బీసీ జనరల్
16వ వార్డు: బీసీ జనరల్
17వ వార్డు: ఎస్సీ జనరల్
18వ వార్డు: జనరల్
19వ వార్డు: జనరల్ మహిళ
20వ వార్డు: ఎస్సీ జనరల్
21వ వార్డు: బీసీ జనరల్
22వ వార్డు: జనరల్ మహిళ
23వ వార్డు: బీసీ మహిళ
24వ వార్డు: బీసీ జనరల్
25వ వార్డు: జనరల్
26వ వార్డు: జనరల్ మహిళ
27వ వార్డు: బీసీ మహిళ
28వ వార్డు: జనరల్ మహిళ