క్రీడా ప్రాంగణాలకు వేములవాడే స్ఫూర్తి
ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న తెలంగాణ క్రీడా ప్రాంగ ణాల కు వేములవాడ నియోజకవర్గమే స్ఫూర్తిదాయకమని స్టేట్ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు పేర్కొన్నారు. గతంలో చందుర్తిలో నిర్వహించిన క్రీడలను సందర్శించిన సందర్భంలో ఈ ఆలోచన స్ఫురించిందన్నా రు
ముంపు గ్రామాల అభివృద్ధికి పెద్దపీట
దళిత బంధు దేశానికే ఆదర్శం
స్టేట్ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే రమేశ్‌బాబు
వేములవాడ రూరల్, జూన్ 10: ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న తెలంగాణ క్రీడా ప్రాంగ ణాల కు వేములవాడ నియోజకవర్గమే స్ఫూర్తిదాయకమని స్టేట్ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు పేర్కొన్నారు. గతంలో చందుర్తిలో నిర్వహించిన క్రీడలను సందర్శించిన సందర్భంలో ఈ ఆలోచన స్ఫురించిందన్నా రు. యువత సెల్‌ఫోన్ మోజులో పడి చెడిపోతున్నదని, క్రీడా ప్రాంగణాలు ఏర్పాటుతో ఆటలకు సమయం వెచ్చించే అవకాశం ఉంటుందని పోలీసు అధికారులతో చర్చించినట్లు చెప్పారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు ఉపక్రమించిందని చెప్పారు. శుక్రవారం చంద్రగిరి, చీర్లవంచ గ్రామాల్లో పర్యటించారు. జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణతో కలిసి భూమిపూజ చేశారు. చీర్లవంచలో ‘మన ఊరు- మన బడి’ కింద రూ. 60 లక్షలతో చేపట్టిన స్కూల్ అభివృద్ధి పనులను ప్రారంభించారు. మహిళా, ఎస్సీ కమ్యూనిటీ భవనాలకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాల్లోని తల్లిదండ్రులను పిల్లలను క్రీడలవైపు ప్రోత్సహిస్తున్నారని, ఇదే తరహాలో మన పిల్లలు కూడా ఆటపై దృష్టిపెట్టేలా చూడాలని ఉ ద్బోధించారు. విద్య, వైద్యరంగాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టిందన్నారు. అనంతరం ఎమ్మె ల్యే రమేశ్‌బాబు చంద్రగిరిలో చీర్లవంచకు చెం దిన లబ్ధిదారుడు కారం రాజయ్య సూపర్ మా ర్కెట్‌ను ఏర్పాటు చేసుకోగా వినోద్‌కుమార్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ లబ్ధిదారులు మెరుగైన యూనిట్లను ఎంచుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని ఆ కాంక్షించారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మ న్ ఆకునూరి శంకరయ్య, ఎంపీపీ బూర వజ్ర మ్మ, జడ్పీటీసీ మ్యాకల రవి, సర్పంచులు రా సూరి రాజేశం, రంగు సత్తమ్మ, ఎంపీటీసీ వనపర్తి దేవరాజు, వైస్ ఎంపీపీ ఆర్సీరావు, సెస్ డైరెక్టర్ హరిచరణ్‌రావు, సర్పంచుల ఫోరం అ ధ్యక్షుడు ఊరడి రాంరెడ్డి, వెంకటరమణ, చెన్నమనేని స్వయంప్రభ, రేగులపాటి రాణి, లక్ష్మారెడ్డి, సహకార సంఘం చైర్మన్ రేగులపాటి కృష్ణదేవరావు, నేతలు బూర బాబు, నరేశ్, హరికృ ష్ణ, పరశురాములు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

