Greater Excellence Award | కోల్ సిటీ, సెప్టెంబర్ 14: గోదావరిఖనికి చెందిన సీనియర్ కళాకారుడు, విలక్షణ నటుడు వేముల అశోక్ ను ప్రతిష్టాత్మక గ్రేటర్ ఎక్సలెన్సీ అవార్డు-2025 వరించింది. నటనపై ఆసక్తితో కళారంగంలో అడుగుపెట్టిన వేముల అశోక్ ఇప్పటివరకు 80 లఘు చిత్రాల్లో నటించారు. మరో 40 వీడియో పాటలను స్వీయ దర్శకత్వంలో చిత్రీకరించారు. తన నిర్మాణ సారథ్యంలో ఎంతోమంది కళాకారులకు ఉపాధి కల్పించడమే గాకుండా రామగుండం ప్రాంతానికి గుర్తింపు తీసుకవస్తున్నారు.
అమేజింగ్ స్టార్ గా జిల్లా వాసులకు సుపరిచితుడిగా పేరు తెచ్చుకున్నారు. మరోవైపు ఎన్వైపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ప్రజాసేవ చేస్తున్నాడు. ఈమేరకు ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎఫ్ టి పీ సి ఇండియా) సంస్థ గ్రేటర్ ఎక్స్ లెన్సీ అవార్డుకు ఎంపిక చేసినట్లు చైర్మన్ చైతన్య జంగా ఆదివారం ప్రకటించారు.
ఈనెల 19న హైదరాబాద్లోని కంట్రీ క్లబ్ లో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఎఫ్టీపీసీఇండియా సంస్థ చైర్మన్ తోపాటు సెక్రెటరీ వీఎస్ వర్మ, మీడియా చైర్మన్ కిరణ్ బేజాడీ, డైరెక్టర్ చంద్రశేఖర్లు అవార్డును ప్రదానం చేస్తారని తెలిపారు. కాగా, ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైన వేముల అశోక్ ను స్థానిక కళా సంఘాల ప్రతినిధులు పలువురు హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు.