కరీంనగర్ కమాన్ చౌరస్తా, మార్చి 23 : కరీంనగర్ జిల్లా కేంద్రంలో మెగా ఆటో షో అట్టహాసంగా ప్రారంభమైంది. రెండు రోజుల ఈ ఎక్స్పో మొదటి రోజు అదిరిపోయింది. ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా ఫూలే (సర్కస్) మైదానం వేదికగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మేయర్ వై సునీల్ రావు, నమస్తే తెలంగాణ అడ్వటైజ్మెంట్ జీఎం సురేందర్‌రావు, ఏజీఎం రాజిరెడ్డి, కరీంనగర్ బ్రాంచ్ మేనేజర్, బ్యూరో ఇన్చార్జి కే ప్రకాశ్‌రావుతో కలిసి ప్రారంభించారు.
అనంతరం స్టాల్స్‌ను పరిశీలించి వాహనాల గురించి తెలుసుకున్నారు. సరికొత్తగా వచ్చిన కియా ఈవీ 6 వాహనాన్ని డ్రైవింగ్ సీట్లో కూర్చుని పరిశీలించారు. అనంతరం క్వాంటమ్ ఎలక్ట్రిక్ వాహనాన్ని ఎమ్మెల్యే గంగుల, మేయర్ సునీల్‌రావు నడిపి సంతోషం వ్యక్తం చేశారు. మొత్తంగా 20కిపైగా కంపెనీలు స్టాళ్లు ఏర్పాటు చేసి, హైరేంజ్ కార్లు, నయా బైక్‌లను ప్రదర్శించగా.. సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నయా మోడళ్ల గురించి ఆరా తీశారు.
ఆధునిక కార్లు, బైక్‌లను పరిశీలిస్తూ.. ఫీచర్లు, ధరల గురించి తెలుసుకున్నారు. తమ ఆసక్తి మేరకు బుకింగ్స్ కూడా చేశారు. నేటి సాయంత్రం వరకు వాహనాల ప్రదర్శన కొనసాగనుండగా, మొదటి రోజు స్పందనను చూసి కంపెనీల ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. సందర్శకుల రెస్పాన్స్, బుకింగ్స్ బాగున్నాయని సంతోషంగా చెబుతున్నారు. షోలో నమస్తే తెలంగాణ కరీంనగర్ యాడ్స్ మేనేజర్ రేణ మల్లయ్య, కరీంనగర్, ఆదిలాబాద్ ఎడిషన్ ఇన్చార్జిలు ఐ సుభాష్, వీ సంపతి, స్టాఫర్ దొంత వెంకటస్వామి, స్టాఫ్ ఫొటోగ్రాఫర్ బాలకిషన్‌రావు, ప్రొడక్టన్ ఇన్చార్జి రాజిరెడ్డి, టెక్నికల్ ఇన్చార్జి రామకృష్ణ, హెచ్ఆర్ ఇన్చార్జి శ్రీలత, స్టోర్ ఇన్చార్జి రవి, అకౌంటెంట్ రాజేందర్, నమస్తే సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మారుతున్న ప్రపంచీకరణ నేపథ్యంలో టాప్ బ్రాండ్లకు ప్రజల్లో మంచి ఆదరణ ఉన్నది. అలాంటి అన్ని రకాల వాహనాలను కరీంనగర్ జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉంచే ప్రయత్నం చేసిన ‘నమస్తే తెలంగాణ’ మరోసారి ప్రజల మన్ననలు పొందింది. హైదరాబాద్ లాంటి మహా నగరాల్లో లభించే బెంజ్, వోల్వో వంటి పెద్ద వాహనాలు మన నగరానికి ప్రదర్శనకు రావడం మంచి విషయం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ వాహనం అవసరం. ప్రతి కుటుంబం కారు ఉండాలని కోరుకుంటున్నది. అలాంటి అన్ని వర్గాలకు అవసరమైన వాహనాలు ఈ షోలో అందుబాటులో ఉన్నాయి. వాటిని వీక్షించి, అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఇందులో ప్రదర్శనకు ఉంచిన వాహనాలకు మంచి గుర్తింపు లభించాలి.
– గంగుల కమలాకర్, కరీంనగర్ ఎమ్మెల్యే
కరీంనగర్ ప్రజలకు అందుబాటులో నగరం నడిబొడ్డున ఉన్న సర్కస్ గ్రౌండ్ వేదికగా ‘నమస్తే తెలంగాణ’ ఆధ్వర్యంలో ఆటో షో ఏర్పాటు చేయడం మంచి విషయం. ఇందులో ఈవీ వాహనాలతోపాటు నగరవాసులకు అన్ని రకాల వాహనాలు అందుబాటులో ఉన్నాయి. నగర వాసులు రెండు రోజులు పాటు జరిగే ఈ ప్రదర్శనను తిలకించి, వారి అవసరాలకు తగిన వాహనాలకు ఎంచుకునే అవకాశం ఉన్నది. అలాగే, ఈ షోలో అందుబాటులో ఉన్న బ్యాంకుల్లో రుణాలు తీసుకునే వెసులుబాటు కూడా ఉంది. వాటిని అందరూ సద్వినియోగం చేసుకోవాలి.
– వై సునీల్ రావు, కరీంనగర్ మేయర్
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమం ద్వారా మాలిక్ కియా వారి సెల్టోస్ వాహనం కొనుగోలు చేశా. ఇది చాలా మంచి అవకాశంగా భావిస్తున్నా. ఇక్కడికి వచ్చిన కొంత సమయంలోనే వాహనం తీసుకోవాలనే ఆలోచన వచ్చింది. ఈ క్రమంలో మాకు మంచి వాహనం కొనుగోలు చేసే అవకాశం లభించడం సంతోషంగా ఉంది. వాహనంలో ఫీచర్ల గురించి వివరించారు. బ్యాంక్ అప్రూవల్ మొత్తం ఇక్కడే అందజేశారు.
– సంగెం లక్ష్మణ్ రావు, కరీంనగర్
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఇలాంటి వేదికలు వినియోగదారులకు చాలా అవసరం. అన్ని కంపెనీలకు చెందిన వాహనాలు ఒకే చోట కొలువుదీరడంతో మనం ఎటూ తిరగనవసరం లేకుండా అన్ని వివరాలు ఇక్కడే తెలుసుకోవచ్చు. ఇంకా అవసరాలకు అనుగుణంగా ఉండే వాహనాలను కొనుగోలు చేసుకునే అవకాశమున్నది. సామాన్య, మధ్య తరగతి ప్రజలు కూడా తమకు అనువైన బడ్జెట్లో సొంత కారు కలను నెరవేర్చుకోవచ్చు. రుణ సౌకర్యం కల్పించే బ్యాంకుల స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం బాగుంది.
– వెంకట్, కరీంనగర్
ఆటో ఎక్సోపోలో మా కంపెనీ పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి అవకాశం కల్పించిన ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ పత్రిక యాజమాన్యాలకు కృతజ్ఞతలు. మా స్టాల్‌కు మంచి ఆదరణ వచ్చింది. కంపెనీకి ఉన్న ప్రాముఖ్యతతో చాలా మంది స్టాళ్లను సందర్శించారు. ముఖ్యంగా యువకులు, నగరవాసులు కొనుగోలుకు ఆసక్తి చూపారు. ఇలాంటి షో ఏర్పాటు చేసిన నిర్వాహకులకు థాంక్స్.
– రోషన్, ఆదర్శ నెక్సా
ఒకే దగ్గర అన్ని రకాల కంపెనీలకు చెందిన వాహనాలను చేర్చడం మంచి ఆలోచన. ఇలాంటి వేదికలు జిల్లా కేంద్రంలో మరిన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. కియా మోటార్స్ కంపెనీ కార్లకు తెలుగు రాష్ట్రాల్లో అపూర్వ ఆదరణ కనిపిస్తున్నది. రెండు రోజుల ప్రదర్శనలో భాగంగా నగరవాసుల నుంచి స్పందన బాగున్నది. సుమారు 45 నుంచి 50 మంది మా స్టాల్స్ సందర్శించి కారులోని ఫీచర్స్ అడిగి తెలుసుకున్నారు. ఒక కారును ఆర్డర్ కూడా అందజేశాం.
– అబ్దుల్లా, కియా మోటార్స్
ఆటో షో ఆలోచన బాగున్నది. అన్ని రకాల కంపెనీలను ఒకే వేదిక వద్దకు చేర్చి వినియోగదారులకు అందుబాటులో ఉంచడం సంతోషకరం. అన్ని రకాల వాహనాలతోపాటు రుణ సదుపాయం కల్పించే బ్యాంకులు కూడా తరలిరావడం, స్టాల్స్ ఏర్పాటు చేయడంతో వినియోగదారులకు మరింత సౌకర్యం కల్పించినట్లు అయింది. తొలిరోజు ప్రదర్శనలో నగరవాసులను నుంచి విశేష స్పందన వచ్చింది. మారెట్లో టయోటా మోటార్స్ అంటే తెలియని వారు చాలా తక్కువ మంది ఉంటారు. వారికి కూడా చేరువ చేయాలన్నదే లక్ష్యం.
– సాయి కిరణ్ రచ్చ, టొయోటా మోటార్స్
కార్ల తయారీలో ఎంజీ కంపెనీకి ప్రత్యేకత ఉంది. మా కంపెనీ నుంచి వచ్చిన అనేక మోడల్ వాహనాలకు మారెట్లో వినియోగదారుల నుంచి మంచి ఆదరణ ఉన్నది. ఆటో ఎక్స్‌పోలో మా కంపెనీ స్టాల్ ఏర్పాటు చేశాం. తొలిరోజు జిల్లావాసుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. దాదాపు 50 మంది వినియోగదారులు మమ్మల్ని సంప్రదించారు. ఈ అవకాశం కల్పించిన ఎక్స్‌పోలో నిర్వాహకులు, వినియోగదారులకు కృతజ్ఞతలు.
– సాయి కిరణ్ కందుకూరి, ఎంజీ మోటార్స్
మా స్టాల్‌ను అనేక మంది యువకులు సందర్శించారు. సెకండ్ హ్యాండ్ వాహనాలు మంచి మన్నికతో అందిస్తామన్న నమ్మకంతో పెద్ద సంఖ్యలో వినియోగదారులు, నగర వాసులు వచ్చి మా వాహనాలు చూశారు. వివరాలు తెలుసుకున్నారు. ఎక్స్‌పోలో మాకు అవకాశం రావడం సంతోషంగా ఉంది.
-రఘు, ట్రూ వ్యాల్యూ
మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి ఆదరణ ఉంది. మా లాంటి జాతీయ స్థాయి సంస్థ నేరుగా ప్రజలకు ముందుకు వెళ్లేందుకు ‘నమస్తే తెలంగాణ’ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం మంచి అవకాశంగా ఉంది. మా వద్ద 80 వేల నుంచి మొదలు రూ.1.30 లక్షల వరకు వాహనాలు అందుబాటులో ఉన్నాయి. కొందరు మా వాహనాలు చూసి సంతోషంగా బుకింగ్స్ చేసుకుంటున్నారు. ఇది మంచి అవకాశం.
– నాగరాజు, ఈ క్వాంటమ్ మోటార్
నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎక్స్పో ద్వారా మా జీప్ సంస్థ ద్వారా వస్తున్న వాహనాలకు మంచి గుర్తింపు ఉంది. అందరూ వా వాహనాలను చూసి సంతోషం వ్యక్తం చేసుకుంటున్నారు. టెస్ట్ డ్రైవ్ చేసి అన్ని సౌకర్యాలను చెక్ చేసుకుంటున్నారు. ఉదయం నుంచి దాదాపు 50 మంది వరకు స్టాల్‌ను సందర్శించారు. వారి సంఖ్య ఆదివారం మరింత పెరుగనున్నది. ఇది మంచి అవకాశంగా భావిస్తున్నా.
– నాగరాజు, జీప్
వాహనాలు కొనాలనుకునేటప్పుడు కొందరు ైస్టెల్ చూస్తారు, మరి కొందరు మైలేజ్ చూస్తారు, మరి కొందరు సేఫ్టీ చూస్తారు, మరి కొందరు డబ్బు చూస్తారు. అలాంటి అన్ని వర్గాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చేందుకు ‘నమస్తే తెలంగాణ’ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన వినియోగదారులు, పాఠకులకు అన్ని రకాల వాహనాలు అందుబాటులో ఉండడంతోపాటు, వారి బడ్జెట్లో వాహనాలు ఎలాంటివి వస్తాయి?, రుణ సదుపాయం ఎలా ఉంటుంది? అని తెలిపేందుకు బ్యాంకులు అందుబాటులో ఉన్నాయి. రెండు రోజులపాటు సాగే ఈ కార్య్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– సురేందర్ రావు, నమస్తే తెలంగాణ అడ్వటైజ్మెంట్ జీఎం
కరీంనగర్ వ్యాప్తంగా మారుతి వాహనాలకు చాలా ఆదరణ ఉంది. ఇదే క్రమంలో నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆటో షోలో చాలా మంది హాజరై వాహనాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. ఈ క్రమంలో దాదాపు 8 వరకు బుకింగ్ అయ్యాయి. గతంలో ఏ సంస్థ నిర్వహించని రీతిలో సిటీ సెంటర్లో నిర్వహించడం మంచి విషయం.
– మధు, జీఎం, ఆదర్శ మారుతి
ఖరీదైన కార్లకు కేరాఫ్ బెంజ్ సంస్థ వాహనాలు. అలాంటి వాహనాలను సైతం సామాన్యులకు అందుబాటులో ఉంచాలనే నేపథ్యంలో కరీంనగర్లో నమస్తే తెలంగాణ ఆటో షోలో మా స్టాల్ ఏర్పాటు చేసుకున్నాం. జిల్లాకు చెందిన చాలా మంది కస్టమర్లు హైదరాబాద్‌కు వచ్చి ఇబ్బంది పడకుండా, ఇక్కడికి వచ్చే వాహనాలు చూస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలా మంచి కార్యక్రమం. ప్రజలకు మరింత చేరవయ్యామనే భావన కలిగింది.
– సంతోష్, బెంజ్
సేఫ్టీ వాహనాలకు మారుపేరు మా వోల్వో సంస్థ అని చెప్పవచ్చు. అలాంటి వాహనాలకు ప్రజల ముందుకు తీసుకువచ్చేందుకు నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో మనం స్టాల్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. ఈ వేదిక ద్వారా ప్రజలకు మా వాహనాల మన్నిక గురించి తెలిసింది. మా సంస్థ తయారు చేసే ఈవీ వాహనాలను చూసి చాలా మంది సంతోషం వ్యక్తం చేశారు. ఇది మాకు మంచి అవకాశం అని చెప్పవచ్చు.
– సాకేత్ సింగ్, వోల్వో
ఆటో ఎక్స్‌పోలో హిరా సుజికీ వాహనాలు చాలా బుకింగ్స్ అయ్యాయి. వాహనదారులు పెద్ద సంఖ్యలో వచ్చారు. వాహనాలు చూసి, వారికి కావాల్సిన వాహనాల కోసం బుకింగ్స్ చేసుకున్నారు. ఇది మంచి అవకాశంగా భావిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాల ద్వారా మార్కెట్లోకి వచ్చే కొత్తవాహనాలను నేరుగా ప్రజల ముందుకు తీసుకువెళ్లగలుగుతున్నాం. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన నమస్తే తెలంగాణ నిర్వాహకులకు కృతజ్ఞతలు.
– గాలి శివ, హిరా సుజికీ
తక్కువ ధరలో కమర్షియల్, పర్సనల్ వాహనాలు అందించడంలో ఆదర్శ మారుతి ముందుంటుంది. ఈ క్రమంలో ఆటో షో ద్వారా బుకింగ్స్ వస్తున్నయ్. చిన్న స్థాయి నుంచి హై క్లాస్ వరకు అన్ని రకాల వాహనాలు అందుబాటులో ఉన్నయ్. వాహనాలు అవసరం ఉన్నవారు ఈ షోకు హాజరై వాహనాలు పరిశీలించి బుక్ చేసుకోవచ్చు. ఇలాంటి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి.
– మునీందర్, మేనేజర్, ఆదర్శ మారుతి
హోండా కార్లను వీక్షించేందుకు చాలా మంది వస్తున్నారు. ఆటో షో ద్వారా ఇప్పటి వరకు శనివారం ఒక్క రోజే దాదాపు 40 మంది వరకు కార్లను వీక్షించగా, పలువురు టెస్ట్ డ్రైవ్ చేశారు. ఇది మంచి పరిణామం. హోండా లాంటి కంపెనీలో సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా కార్లు ఉండడంతో చాలా మంది బుకింగ్స్‌కు ముందుకు వస్తున్నారు. ఇది మాకు సంతోషాన్నిచ్చింది. షో రూంకు రాలేని చాలా మంది ఇక్కడికి వచ్చి కార్లు చూస్తున్నారు.
– గాండ్ల శ్రీనివాస్, హోండా
మహీంద్రా కార్లు బుకింగ్ చేసుకున్న వారికి అతి తొందరగా వాహనం డెలివరీ చేస్తుండడంతో అందరూ సంతోష పడుతున్నరు. ఈ క్రమంలోనే నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటో షోలో మాకు రెండు బుక్ అయ్యాయి. వాహన ప్రియులు చాలా మంది వచ్చి చూస్తూ ఫీచర్స్ తెలుసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికీ అర్థమయ్యే రీతిలో వాహనాల గురించి వివరిస్తున్నాం.
– సిరిల్, మహీంద్రా
కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న ఆటో షోలో చాలా మంది ఆసక్తిగా ప్రదర్శనలు తిలకిస్తున్నారు. ఈ క్రమంలో వచ్చిన వారు వాహనాలను టెస్ట్ డ్రైవ్ నిర్వహించి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అతి తక్కువ ధరలకు మా వాహనాలు అందుబాటులో ఉండడంతో చాలా మంది బుకింగ్స్ కోసం కూడా సంప్రదిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా మా వాహనాలు ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది.
– ఎండీ హర్షద్, ప్రైడ్ సిట్రిన్
యూనియన్ బ్యాంక్ ఏ బ్యాంకూ ఇవ్వని విధంగా అతి తకువ వడ్డీ రేట్లతో వాహనాలకు రుణ సదు పాయం కల్పిస్తున్నది. ఏ వాహనం కొనుగోలు చేసినా దాని ఆన్‌రోడ్ ధరలో 90 శాతం రుణ సదుపాయం కల్పిస్తున్నాం. అలాగే, 8.8 వడ్డీ రేటుతో నూతన వాహనాల రుణాలు మంజూరు చేస్తున్నాం. ఈ రోజు ‘నమస్తే తెలం గాణ, తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో చేసిన ఆలోచన గొప్పగా ఉంది. అన్ని రకాల కంపెనీల టూ వీలర్లు, కార్లు ప్రదర్శనలో ఉంచడంతోపాటు రుణ సదుపాయం కోసం మా బ్యాంకు స్టాల్‌కు అవకాశం కల్పించడం సంతోషంగా ఉంది.
– మారుతి, చీఫ్ మేనేజర్, యూనియన్ బ్యాంక్
అతి తక్కువ ధరకు ఉన్నత శ్రేణి వాహనాలు అందిస్తుండడంతో నిస్సాన్ వాహనాలను కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. గ్లోబల్ రేటింగ్ 4 ఉండడంతోపాటు, రూ.5.99 లక్షల నుంచి వాహనాలు అందిస్తుండడంతో మాకు ఎంతో కలిసి వచ్చే అంశం. ఇలా చాలా మంది ఇక్కడికి వచ్చి వాహనాలు చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు మంచి వాహనాలు పరిచయం చేసిన వారం అవుతాం.
– శ్యాం, లక్ష్మీ నిస్సాన్
ఇస్సూకీ వాహనాలు ఎక్కువ సంఖ్యలో నిర్మాణ రంగంలో ఉపయోగిస్తారనే అపోహ ఉండేది. కానీ, లగ్జరీ సిరీస్‌లోనూ వాహనాలు అందిస్తుండడం, 4 వీల్ డ్రైవ్ వాహనాలు కావడంతో చాలా మంది మా వాహనాలు చూస్తూ ఆసక్తి చూపుతున్నరు. ఇలాంటి కార్యక్రమం ద్వారా మేం ప్రజలకు దగ్గరయ్యాం. నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఆదరణ బాగుంది. ఇలాంటి కార్యక్రమాలు సంవత్సరానికి రెండు మూడు సార్లు నిర్వహించాలి.
– శ్రీనివాస్, మహవీర్ ఇస్సూకీ