సిటీబ్యూరో, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): సెయింట్ మేరీస్ సెంటినరీ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్, స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్, సికింద్రాబాద్ ఆధ్వర్యంలో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వారి సహకారంతో శనివారం కళాశాల ప్రాంగణంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు.
మానవత్వపు ఒక చుక్క.. రక్తదానం చేయండి, ప్రాణాలను కాపాడండి అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద రక్తదానం ప్రాముఖ్యత, సామాజిక బాధ్యతపై విద్యార్థుల్లో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డా.ఆంథోనీ వినయ్ తదితరులు పాల్గొన్నారు.