చిక్కడపల్లి,అక్టోబర్ 3: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరుద్యోగలందరం కలిసి కాంగ్రెస్ పార్టీ కి బుద్ధి చెబుదామని నిరుద్యోగ జేఏసీ నాయకులు రాష్ట్ర సర్కార్‌ను హెచ్చరించారు. శనివారం అశోక్‌నగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేఏసీ నాయకులు కయ్య వెంకటేశ్, ఆర్కె వన్నర్ చోళ, కిరణ్ రాథోడ్, సూర్య, కుమార్, రమేష్, మమేశ్, ప్రకాష్ మాట్లాడారు.
మూడేండ్లుగా నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరుద్యోగుల ఓట్లు అడగడానికి కాంగ్రెస్ అభ్యర్థులు వస్తున్నారని మండిపడ్డారు. గ్రూప్- 1,2,3,4, డీఎస్సీ, జీపీవో తదితర ఉద్యోగ ఖాళీలపై నిరుద్యోగులకు స్పష్టమై నోటిఫికేషన్,భర్తీ షెడ్యుల్‌ను ప్రకటించాలని డిమాండ్ చేశారు.