వీర్నపల్లి, జూన్ 9: వీర్నపల్లి మండల కేంద్రంలో పెద్దవాగు శివారులో ఆదివారం ఆరు వీరగల్లుల శిల్పాలు వెలుగులోకి వ చ్చాయి. ఈ విగ్రహాల ఎడమ చేతిలో విల్లు, బాణం, కుడిచేతి లో కత్తి, కొప్పు, ఈటె పట్టుకొని శత్రువుతో యుద్ధంచేస్తున్నట్లు, వీరస్వర్గం పొందినట్లు చెక్కబడి ఉంది. నాటి కాలంలో పశువులను క్రూర జంతువుల నుంచి రక్షించేందుకు, గ్రామాల్లో దొంగతనాలు జరుగుకుండా కాపలాఉండేందుకు,
వానాకాలంలో చె రువులకు గండిపడిన సమయంలో గ్రామాలను రక్షించేందుకు ధైర్యం కలిగిన వ్యక్తులను యుద్ధవీరులుగా నియమించేవారని తమ పూర్వీకులు చెబుతుంటే విన్నామని గ్రామస్తులు చెప్పారు. అలనాటి సాహస వీరులకు గుర్తుగా వీరగల్లులు శిల్పాలు అక్కడక్కడా కనిపిస్తుంటాయన్నారు. కాగా, శిల్పాలపై వీరగల్లుల ప్రతిరూపాలు బయటపడడంతో నాటి వీరులపల్లి, కాలక్రమేణా వీర్నపల్లిగా మారిందని గ్రామంలో చర్చించుకుంటున్నారు.