Odela | ఓదెల, సెప్టెంబర్ 1 : పెద్దపల్లి జిల్లా ఓదెల సదాశయ ఫౌండేషన్ సభ్యులను వాసన్ ఐ బ్యాంకు యాజమాన్యం మంగళవారం సన్మానించి మెమొంటోలను అందజేశారు. 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం వాసన్ ఐ బ్యాంక్ సీనియర్ మేనేజర్ అరవింద్ కుమార్ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాగ్ లింగంపల్లి హైద్రాబాద్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నేషనల్ ప్రోగ్రాం ఆఫ్ కంట్రోల్ బ్లైండ్ నెస్ అండ్ విజువల్ ఇంపైర్మెంట్ (NPCB & Vl) జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎం. సుపర్ణ మాట్లాడుతూ సదాశయ ఫౌండేషన్ గత 18 సంవత్సరాలుగా నేత్ర అవయవ శరీర దానాలపై చేస్తున్న కృషిని కొనియాడారు.
త్వరలో ఈ అంశంపై కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థలతో ఒక సమావేశం ఏర్పాటు చేసి కార్నియల్ అందత్వ నివారణ కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు టీ శ్రవణ్ కుమార్, లింగమూర్తి, డాక్టర్ మేరుగు భీష్మాచారి, దీటి వెంకటస్వామి, దళపతి, కే శంకర్రావు, జీ కుమారస్వామి, కే రామచంద్రారెడ్డి, వీ శ్రీనివాస్, క్యాతం మల్లేశం, డాక్టర్ వేణు, ఎల్ రాజమౌళి, కే సమ్మయ్య, కనకయ్య, ఎల్ రాజలింగయ్య, పీ నాగేశ్వరరావును ముఖ్య అతిథి డాక్టర్ సుపర్ణ, సీనియర్ మేనేజర్ అరవింద్ కుమార్, కార్నియల్ సర్జన్ డాక్టర్ శ్రీవిన్య ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.