Samantha | సినిమాలకు బ్రేక్, కొత్త అవతారంలో సమంత.. ఈ సమయంలోను రిస్క్ చేస్తుందా?
Samantha | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం తన కెరీర్లో కొత్త అడుగులు వేస్తోంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులను అలరిస్తున్న ఆమె.. ఇప్పుడు టెలివిజన్ రంగంలోకి మళ్లీ అడుగుపెట్టేందుకు సిద్ధమైంది.
Samantha | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం తన కెరీర్లో కొత్త అడుగులు వేస్తోంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులను అలరిస్తున్న ఆమె.. ఇప్పుడు టెలివిజన్ రంగంలోకి మళ్లీ అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ‘సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ తమిళ్’లో సమంత భాగం కానుండగా, ఈ కార్యక్రమానికి సంబంధించిన చిత్రీకరణ ఇప్పటికే ప్రారంభమైనట్లు తెలుస్తోంది. షో షూటింగ్ కోసమే సమంత చెన్నైకి వెళ్లినట్లు సమాచారం. అయితే ఈ కార్యక్రమంలో సమంత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుందా? లేక న్యాయనిర్ణేతగా కనిపిస్తుందా? అనే విషయాన్ని మాత్రం నిర్వాహకులు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. దీంతో ఆమె పాత్రపై ఆసక్తి నెలకొంది.
ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘మాస్టర్ చెఫ్’ ఆధారంగానే ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. అయితే తమిళ వెర్షన్లో స్థానిక సినీ తారలు, తమిళ వంటకాలు, అక్కడి ఆహార సంస్కృతికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పోటీదారులుగా పాల్గొనబోతున్నట్లు సమాచారం. తెరపై తమ నటనతో ఆకట్టుకునే సెలబ్రిటీలు.. వంటగదిలోకి వెళ్లి వంటలు చేయాల్సి వస్తే ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటారు? ఎలాంటి తప్పులు చేస్తారు? కొత్త వంటకాలను ఎలా ప్రయత్నిస్తారు? అనే అంశాలు ప్రేక్షకులకు వినోదాన్ని అందించనున్నాయి. తనకు కూడా సెలబ్రిటీలు వంటలు చేస్తూ చేసే చిన్నచిన్న తప్పులు, కొత్త వంటకాలను ప్రయత్నించే విధానం చూడటం చాలా ఇష్టమని సమంత గతంలో చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో ‘సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ తమిళ్’ కార్యక్రమం ఆమెకు కూడా ప్రత్యేకమైన అనుభవంగా మారే అవకాశం ఉంది.
భోజనం అనేది మనుషులను కలిపే ఒక అద్భుతమైన సాధనమని సమంత గతంలోనే పేర్కొంది. అందుకే వంటలు, ఆహారానికి సంబంధించిన ఈ కార్యక్రమంతో ఆమెకు మంచి అనుబంధం ఏర్పడే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. అయితే సమంత స్వయంగా వంటలు చేస్తుందా? లేక కార్యక్రమాన్ని నడిపిస్తుందా? అనే విషయంలో మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే సినిమాలు, వెబ్ సిరీస్‌లలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న సమంత.. ఇప్పుడు ఈ రియాలిటీ షో ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. తెరపై నటిగా కనిపించే సమంతను కాకుండా.. ఒక కార్యక్రమాన్ని నిర్వహించే లేదా సెలబ్రిటీలతో కలిసి వంటల ప్రపంచంలో సందడి చేసే కొత్త కోణంలో చూడొచ్చనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది.. ‘సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ తమిళ్’ కార్యక్రమం త్వరలో సోనీ విజన్ ఛానల్, సోనీ లివ్ ఓటీటీ వేదికపై ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tesla Flying Car: టెస్లా ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. గాలిలో పల్టీలు కొట్టి.. సేఫ్‌గా ల్యాండైన రోడ్‌స్టర్ 2.. వీడియో
Dragon | ‘డ్రాగన్’ షూటింగ్‌కి రీఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

