పేదల వైద్యులు.. వైరాగ్యం దంపతులు
‘పేదల వైద్యులు వైరాగ్యం రాజలింగం, రీటా బహదుర్ షా దంపతులు. కన్న ఊరిపై మమకారంతో కొదురుపాకలో కంటి దవాఖాన ప్రారంభించి ఏడాదిలోనే 600 మందికి ఉచితంగా ఆపరేషన్లు చేయడం అభినందనీయం.
- 600 మందికి ఉచిత కంటి ఆపరేషన్లు చేయడం అభినందనీయం
- కొదురుపాక బీసీఎం దవాఖాన సేవలు సద్వినియోగం చేసుకోవాలి
- ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
- కంటి వైద్య నిపుణులు రాజలింగం-రీటా దంపతులకు ఘన సన్మానం
బోయినపల్లి, డిసెంబర్ 18: ‘పేదల వైద్యులు వైరాగ్యం రాజలింగం, రీటా బహదుర్ షా దంపతులు. కన్న ఊరిపై మమకారంతో కొదురుపాకలో కంటి దవాఖాన ప్రారంభించి ఏడాదిలోనే 600 మందికి ఉచితంగా ఆపరేషన్లు చేయడం అభినందనీయం. ఈ ప్రాంత ప్రజల అదృష్టం’ అని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కొనియాడారు. ప్రముఖ కంటి వైద్య నిపుణుడు, బీసీఎం దవాఖాన వ్యవస్థాపకుడు డా.వైరాగ్యం రాజలింగంతో ఇప్పటికే కంటి ఆపరేషన్ చేయించుకున్న ఎమ్మెల్యే, ఆదివారం కొదురుపాక బీసీఎం కంటి దవాఖానలో పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా నేడు కంటి దవాఖాన మొదటి వార్షికోత్సవం అని తెలియగానే ఎమ్మెల్యే రవిశంకర్, వెంటనే కేకు, పూల దండ, శాలువా తెప్పించారు.
బీసీఎం కంటి దవాఖాన వ్యవస్థాపకులైన ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డా.వైరాగ్యం రాజలింగం, డా రీటా బహదుర్ షా దంపతులను సన్మానించి, స్వీటు తినిపించారు. కంటి వైద్యం చాలా ఖర్చుతో కూడుకున్నదని, ఈ క్రమంలో గ్రామాల్లో ఎంతో మంది పేదలు వైద్యం చేయించుకునే స్థోమత లేక అవస్థలు పడుతున్నారన్నారు. వారి కోసం మారుమూల గ్రామమైన కొదురుపాకలో కార్పొరేట్ కంటి దవాఖాన ప్రారంభించి ఉచిత కంటి ఆపరేషన్లు చేయడం అభినందనీయమన్నారు. బీసీఎం దవాఖాన కంటి వైద్య సేవలను పేద ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దవాఖానకు తన పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో దవాఖాన సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

