Ursu celebrations | చిగురుమామిడి, జూలై 11: చిగురుమామిడి మండలంలోని రామంచ గ్రామంలో రెండు రోజులపాటు ఉర్సుఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. దర్గా నిర్వాకుడు మహమ్మద్ కరీంఖాన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రెండు రోజులపాటు నిర్వహించారు. జిల్లాలోనే పేరోందిన రామంచ దర్గాను విద్యుత్ కాంతులతో ముస్తాబు చేశారు. దర్గాలో గురువారం రాత్రి నర్రా వేణుగోపాల్ రెడ్డి ఇంటి నుండి గంధం తీసుకొని ప్రత్యేక పార్థనలు చేస్తూ ర్యాలీగా దర్గా వద్దకు చేరుకున్నారు. ఈ ర్యాలీలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
గ్రామస్తులకు భక్తులకు అన్నదానం
ప్రతీ ఏటా రామంచలో నిర్వహించే రెండు రోజుల దర్గా ఉర్సు ఉత్సవాలలో భాగంగా శుక్రవారం దర్గా వద్ద పూజ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులకు, గ్రామస్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తరతకుండా అన్ని ఏర్పాట్లను చేసినట్లు నిర్వాహకుడు కరీం ఖాన్ తెలిపారు. సందల్ ఊరేగింపులో అనేక ప్రదర్శనలు చేపట్టడం జరిగిందని, భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయని అన్నారు. ఉత్సవాలకు సహకరించిన గ్రామస్తులకు కరీంఖాన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకల్లో ఫరీద్ బాబా, జిలాని, అబ్దుల్ ఖాన్, ఇమ్రాన్, నవీన్, నవాజ్, అజీజ్ ఖాన్, లడ్డు షారుక్, సిద్ధంకి రాజమల్లు, ఖాత తిరుపతి, రాచకొండ సంపత్ తదితరులు పాల్గొన్నారు.