Ganneruvaram | గన్నేరువరం, జూలై 28 : ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యల పరిష్కార కోసం చలో హైదరాబాద్ కార్యక్రమానికి సంబంధించిన ధర్నా పోస్టర్ ను గన్నేరువరం మండల కేంద్రంలోని వనరుల కేంద్రంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నాయకులు మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయ సమస్యలన్నీ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జారతి నర్సయ్య, మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, మండల విద్యాధికారి రామయ్య, నాయకులు శ్రీరామ నరేందర్, ఎర్ర మల్లేశం, గుండ కిరణ్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.