తిమ్మాపూర్, మే 4 : అకాల వర్షం అన్నదాతలను భయాందోళనకు గురిచేస్తున్నది. మబ్బులు నల్లబడినా.. గాలి వీచినా.. చిన్న చినుకు పడినా గుండెల్లో దడ పడుతున్నది. ఆగమేఘాల మీద కొనుగోలు కేంద్రాల్లో పోసిన వడ్ల కుప్పల టార్పాలిన్ కవర్లు కప్పాల్సి వస్తున్నది. మరోవైపు కేంద్రాల్లో కొనుగోళ్ల ఆలస్యంతో రోజులకొద్దీ ధాన్యాన్ని కాపాడుకోవాల్సి వస్తున్నది.
ఆదివారం సాయంత్రం తర్వాత ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల కొద్దిసేపు అకాల వర్షం పడగా, రైతులంతా ఇలానే ఆగమయ్యారు. చినుకులు పడడంతో వడ్ల కుప్పలను కాపాడుకునేందుకు పరదాలు కప్పేందుకు ప్రయత్నించారు. గాలులు ఎక్కువగా వీయడంతో ఇబ్బంది పడ్డారు.