ఎర్దండి గ్రామ పరిధిలోని వడ్డెర కాలనీలోని కూలిన ఇంటి వద్ద బాధిత కుటంబం
Rain damage | మెట్పల్లి ఏప్రిల్ 18: శుక్రవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షం కురిసింది. మెట్పల్లి పట్నంతోపాటు ఇబ్రహీంపట్నం మల్లాపూర్, కోరుట్ల, మెట్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఈదురు గాలులు, వడగళ్లతో కూడిన భారీ వర్షం పడింది.
పలు గ్రామాల్లో దిగుబడి కి సిద్ధంగా ఉన్న వరి, నువ్వు పంటలకు తీవ్ర నష్టం జరగగా, మామిడి కాయలు నేలరాలాయి. మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో పసుపు తడిసిపోయింది. చేతికందవచ్చిన పంట నేలపాలు కావడంతో రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు.
అలాగే ఇబ్రహీంపట్రం మండలంలోని ఎర్దండి గ్రామ పరిధిలోని వడ్డెర కాలనీలోని ఇళ్లు నేలమట్టమైంది. దీంతో ఆ కుటుంబం వీధిన పడింది. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు