Korutla | కోరుట్ల, ఏప్రిల్ 27: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల 1974-1975 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు ఆదివారం పట్టణంలోని పీబీ గార్డెన్ లో స్వర్ణోత్సవ సంబురాలు జరుపుకొన్నారు. పూర్వ విద్యార్థులంతా ఒకచోట కలిసి తమ చిన్ననాటి మధుర జ్ఞాప కాలను నెమరు వేసుకున్నారు. 60 మంది విద్యార్థులు తమ కుటుంబాలతో కలిసి వచ్చి రోజంతా ఉల్లాసంగా గడిపారు.
సహా పంక్తి భోజనం చేసి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు చౌల పరంధాం, పిన్నంశెట్టి ఆనంద్, ఆల్లె మహాదేవ్, బూరుగు రామస్వామి గౌడ్, మానుక ప్రవీణ్, చేట్పల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.