Blood donation camp | చిగురుమామిడి, జూలై 11 : మండలం ముదిమానిక్యం గ్రామంలో బీజేపీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పుట్టినరోజు పురస్కరించుకొని శుక్రవారం రక్త దాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ మండల అధ్యక్షులు పోలోజు సంతోష్ హాజరై మాట్లాడారు. 20 మంది యువకులు రక్త దానం శిబిరంలో పాల్గొనడం అభినందనీయమన్నారు.
పార్లమెంటు పరిధిలో ప్రభుత్వ స్కూల్ లో చదువుకునే పదో తరగతి విద్యార్థులకు చదువుకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేసినందుకు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు అచ్చ రవీందర్, జిల్లా నాయకులు ముంజ చంద్రయ్య, గర్థస్ సతీష్, బండి ఆదిరెడ్డి, బుధర్థి మహేందర్, కొమిరే రాజయ్య, జుపాక రాకేష్, పైడిపల్లి తిరుపతి, పేసరి హరీష్, పున్నం రాజలింగం, మిదిదొడ్డి ప్రశాంత్, సిద్దెంకి అనిల్, కయ్యం రజినీకాంత్, బుస చెందు, పెంటం కళ్యాణ్, ముసాపురి రాజేష్, నమిళికొండ ప్రశాంత్, గట్టు అజయ్, ఈశ్వర్, బోయిని సందీప్, పైస కార్తీక్, పైస ప్రణీత్, బొయిని చరణ్ తేజ తదితరులు పాల్గొన్నారు.