Bandi Sanjay | రుద్రంగి, జూలై 11: రుద్రంగి మండల కేంద్రంలో కేంద్ర హోం శాఖ, సహాయ మంతి, కరీంగనర్ ఎంపీ బండి సంజయ్ జన్మదిన వేడుకలను ఆ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు కర్ణవత్తుల వేణుగోపాల్ అధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, వారు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చ జిల్లా అధ్యక్షుడు నంద్యాడపు వెంకటేష్, పడాల గణేష్, బోయ నర్సరెడ్డి. గండి శ్రీనివాస్, నర్సింగరావు, గంగాధర్, శ్రీదర్, వెంకటేష్, నరేష్, సంజయ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.